: రేపే కౌంటింగ్... మధ్యాహ్నం 12 గంటలకల్లా ఉత్కంఠకు తెరపడే అవకాశం
దేశ వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠ రేపు వీడనుంది. ఢిల్లీ రాజు ఎవరో తేలనుంది. అంతేకాకుండా, ఏపీ, తెలంగాణలో ఎవరు మొనగాడో తెలవనుంది. దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలకు రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది. అలాగే, ఆంధ్రప్రదేశ్ లో 25 ఎంపీ, 175 ఎమ్మెల్యేల భవితవ్యం తేలనుంది. తెలంగాణలో 17 ఎంపీ, 119 ఎమ్మెల్యే అభ్యర్థుల భవిష్యత్తు తేలిపోనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకంతా ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది.