: క్రికెట్ అభిమానులకు పండగే...మళ్లీ భారత్, పాక్ మ్యాచ్ లు


భారత క్రికెట్ అభిమానులకు పండగలాంటి వార్త ఇది. పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఉన్న నిషేధాన్ని భారత్ ఎత్తివేయనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ లు మళ్లీ మొదలు కాబోతున్నాయి. 2015 నుంచి 2023 వరకు పాకిస్థాన్ తో భారత్ ఆరు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడనుంది. 26/11 దాడుల తరువాత పాక్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

తాజాగా బీసీసీఐతో పీసీబీ ఆరు సిరీస్ లకు సంబంధించి ఎంవోయూ కుదుర్చుకుంది. ముందుగా వచ్చే ఏడాది అబుదాభి వేదికగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, రెండు టీ20లు ఆడనున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత్, పాక్ జట్లు ఆరు సిరీసుల్లో 14 టెస్టులు, 30 వన్డేలు, 12 టీ20లు ఆడతాయి.

  • Loading...

More Telugu News