: మానస సరోవరం యాత్రలో నానా కష్టాలు పడుతోన్న భక్తులు
మానస సరోవరం యాత్రకు వెళ్లిన భక్తులు నానా కష్టాలు పడుతున్నారు. విపరీతంగా కురుస్తున్న మంచుతో భక్తులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. కైలాస్ పర్వతం వద్ద 20 మంది భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. యాత్రికుల ఇబ్బందులను సదరన్ ట్రావెల్స్ పట్టించుకోలేదు. కనీస వసతులు లేని గుడారాల్లో బస ఏర్పాటు చేయడంపై యాత్రికులు ట్రావెల్స్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనక్కి వెళ్తామని చెప్పినా ట్రావెల్స్ సిబ్బంది పట్టించుకోవడం లేదని, దీనిపై విదేశాంగ శాఖ జోక్యం చేసుకోవాలని యాత్రికులు కోరుతున్నారు. వీరిలో మన రాష్ట్రానికి చెందిన వారు 20 మంది ఉన్నారు. మరో మూడు రోజుల పాటు మంచులోనే ఉండాలని ట్రావెల్స్ సిబ్బంది చెబుతున్నారు. దీంతో తగినంత ఆక్సిజన్ అందక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.