: ఎమ్మార్వో ఇంట్లో ఈవీఎం ప్రింటర్ యూనిట్లు


ప్రకాశం జిల్లాలో ఓ ఎమ్మార్వో ఏకంగా ఈవీఎం ప్రింటర్ యూనిట్లను తన బంధువుల ఇంట్లో పెట్టుకున్న సంఘటన కలకలం రేపింది. ఒంగోలు గానుగుపాలెంలోని ఎమ్మార్వో ఇంట్లో మొత్తం 30 ఈవీఎం ప్రింటర్ కమ్ ఆగ్జిలరీ యూనిట్లు (పాడు) ఉంచుకున్నాడని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా 30 'పాడు' యూనిట్లు బయటపడ్డాయి.

వెంటనే వాటిని ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. వీటిని ముళ్లమూరు తహసీల్దార్ జిలానీ తన బంధువుల ఇంట్లో ఉంచినట్లు తెలిసింది. స్ట్రాంగ్ రూంలలో గానీ, భద్రంగా కార్యాలయంలో గానీ ఉండాల్సిన ఈ 'పాడు' యూనిట్లు అధికారి బంధువుల ఇంట్లో ఉండడంపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News