: నోకియా చెన్నై ప్లాంట్ నుంచి 5 వేల మంది అవుట్
చెన్నైలోని నోకియా మొబైల్ తయారీ ప్లాంట్ నుంచి 5 వేల మంది ఉద్యోగులు స్వచ్చందంగా తప్పుకున్నారు. మొత్తం 6,500 మంది ఉద్యోగులు ఇక్కడ పని చేస్తున్నారు. ఫిన్లాండ్ కు చెందిన నోకియా కంపెనీ మొబైల్ ఫోన్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ కు విక్రయించిన విషయం తెలిసిందే. డీల్ లో భాగంగా చెన్నై ప్లాంట్ కూడా మైక్రోసాఫ్ట్ కు వెళ్లాల్సి ఉంది. అయితే, నోకియా, కేంద్ర ప్రభుత్వం మధ్య పన్ను వివాదం కొనసాగుతుండడంతో చెన్నై ప్లాంట్ బదిలీ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో కంపెనీ స్వచ్చంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించగా.. చాలా వరకు ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.