: పదో తరగతి ఫలితాలు విడుదల... బాలికలదే పైచేయి
పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను గవర్నర్ సలహాదారుడు సలావుద్దీన్ విడుదల చేశారు. మొత్తంమ్మీద 88.62 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో బాలికలే అధిక శాతం ఉన్నారు. బాలికలు 89.33 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 87.96 శాతం ఉత్తీర్ణులయ్యారు.