: విదేశీ రాహుల్ సెలవుల కోసమే భారత్ కు వచ్చారు: శివసేన
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై శివసేన విమర్శలు చేసింది. నిన్న ప్రధానికి ఇచ్చిన వీడ్కోలు విందుకు రాహుల్ గైర్హాజరు కావడంపై శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. రాహుల్ విదేశీ వ్యక్తి అని, సెలవుల్లో భారత్ వచ్చారని వ్యాఖ్యానించారు. సెలవులు అయిపోగానే విదేశంలోని తన నివాసానికి తిరిగి వెళతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్ సీ నేత, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా రాహుల్ చర్యను తప్పుబట్టారు. ఒకవేళ రాహుల్ ప్రధానిని ముందే కలసి తన గైర్హాజరుపై చెప్పి ఉంటే ఆ విషయాన్ని అప్పుడే ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. బీజేపీ కూడా విమర్శలు కురిపించింది.