: పంపకాల్లో తేడా వస్తే ఖబడ్దార్... సీమాంధ్ర ఆర్టీసీ సంఘాల హెచ్చరిక


రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్టీసీ ఆస్తుల విభజనకు సంబంధించి ఆర్టీసీ బోర్డు సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో చర్చించిన వివరాలను, ప్రతిపాదనలను గవర్నర్ నరసింహన్ ఆమోదం కోసం పంపుతారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీకి రూ. 9,548 కోట్ల ఆస్తులు, రూ. 4,725 కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో సీమాంధ్రకు ఆస్తులను పంచాలని సీమాంధ్ర ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. పంపకాల్లో ఏమాత్రం తేడా వచ్చినా సమ్మె తప్పదని ఆర్టీసీ యాజమాన్యానికి హెచ్చరికలు పంపాయి.

  • Loading...

More Telugu News