: 230 నక్షత్ర తాబేళ్ల పట్టివేత
భారత్ నుంచి అక్రమంగా థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లోని విమానాశ్రయానికి తీసుకొచ్చిన నక్షత్ర తాబేళ్లను అధికారులు పట్టుకున్నారు. కోల్ కతా నుంచి వచ్చిన ఇండిగో విమానంలోని నాలుగు సూట్ కేసులను తెరచి చూడగా 230 తాబేళ్లు బయటపడ్డాయి. తనిఖీలకు బయపడి ఎవరో వాటిని వదిలేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ఈ తాబేళ్ల విలువ 18 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.