: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అప్పు 2,631 కోట్లు
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్టీసీ విభజన ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు అధికారులు వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10,352 బస్సులను, 70,231 మంది సిబ్బందిని, 122 డిపోలను ఆంధ్రాకు కేటాయించారు. కాగా ఆర్టీసీ అప్పులో 2,631 కోట్ల రూపాయల అప్పును ఆంధ్రా ఆర్టీసీకి మిగిల్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆర్టీసీని నాలుగు జోన్లుగా విభజించారు.