: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తాం: సోమిరెడ్డి
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధీమాగా చెప్పారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, ఉజ్వల భవిష్యత్ కోసం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించారని అన్నారు. కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తామని సోమిరెడ్డి తెలిపారు.