: అభయ నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష
హైదరాబాదులో గత ఏడాది అక్టోబర్ 18న నగర శివారుల్లో 'అభయ'పై అత్యాచారానికి పాల్పడిన సతీష్, వెంకటేశ్వర్లుకు ఒక్కొక్కరికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. చెరో వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించింది. ప్రతిష్ఠాత్మకమైన 'అభయ' కేసులో పోలీసులు శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలు సేకరించి కోర్టు ముందు ఉంచడంతో న్యాయస్థానం నిందితులిద్దరినీ దోషులుగా నిర్ధారించి, శిక్ష ఖరారు చేసింది. నిందితులిద్దరూ తాము నేరం చేయలేదని జడ్జికి తెలిపారు. కాగా, ఐపీసీ 376డీ ప్రకారం నేరం నిర్ధారణ అయిందని న్యాయమూర్తి ప్రకటిస్తూ తీర్పు వెల్లడించారు.