: భారత్ సత్తాను చాటగలిగేది పారిశ్రామికవేత్తలే: రాహుల్


భారత దేశ సత్తా ప్రపంచానికి చాటిచెప్పగల శక్తి పారిశ్రామిక వేత్తలదేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో జరిగిన భారత పారిశ్రామిక వేత్తల సంఘం (సిఐఐ) సమావేశంలో పాల్గొని రాహుల్ మాట్లాడారు. దేశ అభివృద్ధిలో పారిశ్రామిక వేత్తల పాత్ర చాలా కీలకమన్నారు. ప్రపంచంలోనే చౌక మానవ వనరులు భారత్ సొంతమని.. వాటిని సక్రమంగా వినియోగించుకుంటే దేశానికి తిరుగుండదన్నారు. 

పాఠ్యప్రణాళికలలో కార్పొరేట్లకు పాత్ర ఉందా? అని రాహుల్ ప్రశ్నించారు. పనికిరాని వాటిని, కాలం చెల్లినవాటిని చదవమంటూ విద్యార్థులను ఎందుకు బలవంతపెడతారని సూటిగా అడిగారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు గల విద్య మన దగ్గర ఉందని.. కానీ అది చాలా తక్కువగా ఉందన్నారు. యూనివర్సిటీలు పరిశ్రమల నుంచి వనరులను పొందాల్సి ఉన్నా అది జరగడం లేదన్నారు. పారిశ్రామిక వేత్తల సహకారం లేకుండా ప్రభుత్వం ఒక్కటే ఏమీ చేయలేదని రాహుల్ చెప్పారు. 

  • Loading...

More Telugu News