: ఐఐటీ-జేఈఈ మెయిన్స్ పరీక్షకు అర్హత పత్రం కంపల్సరీ
ఐఐటీ-జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులంతా తప్పనిసరిగా అర్హత పత్రం తీసుకురావాలని జేఈఈ మెయిన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజ్ బీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ఈనెల 7వ తేదీన జరుగనుంది. దీంతో ఈనెల 7న ఆఫ్ లైన్ లో జరిగే జేఈఈ-మెయిన్స్ పరీక్షకు, తదుపరి జరిగే జేఈఈ-మెయిన్స్ ఆన్ లైన్ పరీక్ష రాసే అభ్యర్థులకు అర్హత పత్రం తప్పనిసరి కానుంది.
ఇందుకుగాను, ఈ ఏడాది 12వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు హాల్ టికెట్లతో, గతేడాది, అంతకుముందు ఏడాది 12వతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మార్కుల మెమోతోనూ పరీక్షకు హాజారుకావాల్సిఉంది.
ఇందుకుగాను, ఈ ఏడాది 12వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు హాల్ టికెట్లతో, గతేడాది, అంతకుముందు ఏడాది 12వతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మార్కుల మెమోతోనూ పరీక్షకు హాజారుకావాల్సిఉంది.