: నన్ను ఓడించేందుకు తమ్మినేని రూ. 15 కోట్లు తీసుకున్నాడు: సీపీఐ నారాయణ


సీపీఎం నేత తమ్మినేని వీరభద్రంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విరుచుకుపడ్డారు. గతంలో పువ్వాడ నాగేశ్వరరావును ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి తమ్మినేని రూ. 70 లక్షలు తీసుకున్నారని... ఇప్పుడు తనను ఓడించేందుకు వైకాపాతో ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. తనను ఓడించేందుకు వైఎస్సార్సీపీ నుంచి తమ్మినేని రూ. 15 కోట్లు తీసుకున్నారని ఘాటైన విమర్శలు చేశారు. సీపీఎం పార్టీ ఓ దివాళాకోరు పార్టీగా తయారైందని... నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇవాళ హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News