: తెలంగాణలో టీఆర్ఎస్ దే హవా: లగడపాటి సర్వే
లగడపాటి రాజగోపాల్ తన సర్వే ఫలితాలను వెల్లడించారు. తెలంగాణలో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేస్తుందని లగడపాటి తెలిపారు. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను... టీఆర్ఎస్ 50-60 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 30-40 స్థానాలను గెలుచుకుంటుందని... టీడీపీ, బీజేపీ కూటమికి 18-20 స్థానాలు దక్కుతాయని చెప్పారు. ఎంఐఎంకు 7-9 అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉందని తెలిపారు.
అలాగే, తెలంగాణ లోక్ సభ ఫలితాల విషయానికొస్తే... టీఆర్ఎస్ 8-10 స్థానాలను దక్కించుకుంటుందని లగడపాటి తెలిపారు. కాంగ్రెస్ 3-5 స్థానాలు, టీడీపీ, బీజేపీ కూటమి 3-4 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంటాయని చెప్పారు. ఎంఐఎం ఒక లోక్ సభ స్థానం దక్కించుకుంటుందని వెల్లడించారు.