: విద్యుత్ ఛార్జీల పెంపును నేటి సమీక్షలో ఉపసంహరించుకోండి: వైఎస్ విజయమ్మ
విద్యుత్ ఛార్జీలు, సర్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేస్తున్న నిరాహారదీక్ష నేటితో మూడో రోజుకు చేరింది.
విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఈరోజు నిర్వహించే సమీక్షలో వెనక్కు తీసుకోవాల్సిందేనని విజయమ్మ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఛార్జీలు తగ్గేంత వరకూ తన దీక్ష కొనసాగుతుందని చెప్పారు. ఛార్జీల పెంపు నిర్ణయం ఏకపక్షమని కాంగ్రెస్ నేతలే అంటున్నా, సర్కారుకు ఏమాత్రం పట్టడంలేదని ఆమె ఎద్దేవా చేశారు.