: సీమాంధ్రలో టీడీపిీకి 115-125 సీట్లు: లగడపాటి సర్వే
ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తన సర్వే ఫలితాలను వెల్లడించారు. సీమాంధ్రలో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రాంతంలో టీడీపీ, బీజేపీ కూటమి 115-125 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. వైకాపాకు కేవలం 45 నుంచి 55 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
అలాగే, సీమాంధ్రలో టీడీపీ, బీజేపీ కూటమికి 19-22 ఎంపీ స్థానాలు వస్తాయని లగడపాటి చెప్పారు. వైకాపాకు 3 నుంచి 6 ఎంపీ స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలిపారు.