: ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైతే ఎవరికి ఏ మంత్రిత్వ శాఖలు?
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరితే ఎవరికి ఏ మంత్రిత్వ శాఖలు దక్కుతాయనే విషయమై బీజేపీ వర్గాలు కొంత సమాచారాన్ని వెల్లడించాయి. దీని ప్రకారం సుష్మాస్వరాజ్ కు రక్షణ శాఖ, నితిన్ గడ్కరీకి రైల్వే, అరుణ్ జైట్లీకి ఆర్థిక శాఖ లేదా విదేశాంగ శాఖ కేటాయించే అవకాశాలున్నాయి. ఎల్.కె అద్వానీని ఎన్డీయే చైర్ పర్సన్ గా నియమించవచ్చు. లోక్ జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాశ్ పాశ్వాన్ కు ఆరోగ్యం లేదా వ్యవసాయ శాఖ కేటాయించే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. అలాగే మోడీ 20న ప్రమాణం చేయవచ్చని చూచాయిగా వెల్లడించాయి.