: సొంత నియోజకవర్గంలో డీకే అరుణకు ఎదురుగాలి
మాజీ మంత్రి డీకే అరుణకు తన సొంత నియోజకవర్గం గద్వాలలో ఎదురుగాలి వీచింది. నియోజకవర్గంలోని 4 మండలాల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి... రాహుల్ గాంధీ చెప్పినట్టు మహిళా నేత సీఎం అయ్యేటట్టయితే... ఆ పదవికి డీకే అరుణ కూడా ముందు వరుసలో ఉంటారు. అలాంటిది, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో ఏకంగా నాలుగు మండలాల్లో కాంగ్రెస్ గల్లంతవడం అరుణకు శరాఘాతమే.