: గిరిరాజ్ సింగ్ నోట మళ్లీ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ బీహార్ నేత గిరిరాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు అందరూ ఒకే మతానికి చెందిన వారు ఎందుకని ఉంటున్నారు? అంటూ ప్రశ్నించారు. 'ఒక కమ్యూనిటీకి చెందిన ప్రతీ ఒక్కరూ ఉగ్రవాది అని నా ఉద్దేశం కాదు. కానీ, అరెస్ట్ అయిన వారందరూ ఒకే మతవర్గం వారయినప్పుడు సెక్యులర్ పార్టీలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి?' అని అన్నారు. కాశ్మీరీ ప్రజలు దేశంలో ఎక్కడైనా ఆస్తులను కొనుగోలు చేయవచ్చని, వారికి ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న ఆర్టికల్ 370పై రిఫరెండం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. గిరిరాజ్ నెల క్రితం కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో కేసుల్లో ఇరుక్కున్నారు. ఎన్నికల తర్వాత మోడీ వ్యతిరేకులు పాకిస్థాన్ కు వెళ్లాల్సి ఉంటుందంటూ లోగడ ఆయన వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్నారు.