: తెలంగాణలో కాంగ్రెస్ 1432 , టీఆర్ఎస్ 1186
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోంది. ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాల ప్రకారం... 1432 ఎంపీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా, టీఆర్ఎస్ 1186 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ 647 స్థానాలతో మూడో స్థానంలో ఉంది. వామపక్షాలు 153 ఎంపీటీసీలను కైవసం చేసుకోగా, ఇతరులు 643 స్థానాల్లో విజయకేతనం ఎగరవేశారు.
జడ్పీటీసీల్లో మాత్రం టీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఇప్పటిదాకా 106 జిల్లా పరిషత్ స్థానాలను టీఆర్ఎస్ సొంతం చేసుకోగా, 55 స్థానాలతో కాంగ్రెస్ ద్వితీయ స్థానంలో ఉంది. టీడీపీ 10, ఇతరులు 7 స్థానాల్లో గెలుపొందారు.