: టీఆర్ఎస్ ఖాతాలో ఆదిలాబాద్, కరీంనగర్ కూడా!
ఉత్తర తెలంగాణలోని రెండు జిల్లాల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మెజారిటీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అంతకు ముందే నిజామాబాద్ కూడా గెలుచుకుంది. దీంతో ఉత్తర తెలంగాణలో తమ పార్టీకి తిరుగులేదని టీఆర్ఎస్ నిరూపించింది.