: మరోసారి జేకేసీఏ అధ్యక్షుడిగా ఫరూఖ్ అబ్దుల్లా
జమ్మూ అండ్ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) అధ్యక్షుడిగా ఫరూఖ్ అబ్దుల్లా మరోసారి ఎన్నికయ్యారు. జేకేసీఏ నిర్వహించిన ఎన్నికల సందర్భంగా గందరగోళ పరిస్థితులు, వాకౌట్ లు చోటు చేసుకున్నాయి. ఈ గందరగోళం నడుమనే జేకేసీఏ ఫరూఖ్ అబ్దుల్లా పేరు ప్రకటించింది. రానున్న మూడేళ్ల వరకు ఫరూఖ్ అబ్దుల్లా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.