: ఖమ్మం జిల్లాలో దూసుకుపోతున్న టీడీపీ


ఖమ్మం జిల్లాలో ఇవాళ జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ దూసుకుపోతోంది. టీడీపీ 60 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ 16 స్థానాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలు, సీపీఐ 5, న్యూ డెమొక్రసీ 7, సీపీఎం 9, ఇతరులు 6 స్థానాలు గెలుచుకున్నారు.

అదే విధంగా జిల్లా పరిషత్ స్థానాల్లో కూడా టీడీపీ ముందంజలో ఉంది. కాగా కౌంటింగ్ మందకొడిగా సాగడంతో ఫలితాల విడుదల ఆలస్యమవుతోంది. పాల్వంచ మండల పరిషత్ ను కూడా టీడీపీ కైవసం చేసుకుంది.

  • Loading...

More Telugu News