: సీఎంకు రాఘవులు లేఖ


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు లేఖ రాశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి సేవల్లో కాగడాలు పడుతూ.. తరతరాలుగా సేవలు చేస్తున్న రజకులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని ముఖ్యమంత్రిని రాఘవులు కోరారు. టీటీడీ నిర్వహిస్తున్న కాటేజీలు, ఆస్పత్రుల్లో వాడే వస్త్రాలు, దుస్తులను శుభ్రం చేసే పనుల్ని, ఇస్త్రీ చేసే పనులని ముంబయికి చెందిన ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగించారని రాఘవులు ఆరోపించారు.

దీని వల్ల స్థానిక రజకులకు అన్యాయం జరుగుతోందనీ, వారి పొట్ట కొడుతున్నట్టు అవుతోందనీ ఆయన పేర్కొన్నారు. ఈ పనులను స్థానిక రజకులకే కేటాయించాలని గతంలోనే 802వ నెంబరుతో టీటీడీ తీర్మానం చేసిందనీ, ఈ తీర్మానం చేసి నాలుగేళ్లు గడిచినా ఇంకా అమలు కాలేదని రాఘవులు లేఖలో ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News