: బీజేపీ అధ్యక్ష పీఠంపై మరోసారి కన్నేసిన గడ్కరీ!
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పీఠంపై నితిన్ గడ్కరీ మరోసారి కన్నేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగూ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి, తనకు మళ్లీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తారని భావించిన ఆయన దానిపై మాట్లాడేందుకు ఈ రోజు పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీని కలిశారు. ఈ సందర్భంగా తన కోరికను వెల్లడించినట్లు సమాచారం. అయితే, గడ్కరీ ప్రయత్నాన్ని తెలుసుకున్న ఆర్ఎస్ఎస్ నిర్మొహమాటంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. రాజ్ నాథ్ సింగే అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టం చేసిందట. ఏడాదిన్నర కిందట తన సొంత కంపెనీలకు సంబంధించి ఆదాయపు పన్ను వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న గడ్కరీ అధ్యక్ష పదవినుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా, దీనికి సంబంధించి ఎలాంటి దర్యాప్తు చేయడం లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.