: లెక్కింపు కేంద్రంపై తేనెటీగల దాడి... బెంబేలెత్తిన సిబ్బంది


శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఓట్ల లెక్కింపు కేంద్రంపై తేనెటీగలు దాడి చేశాయి. సిబ్బంది లెక్కింపు జరుపుతుండగా, అకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది వెంటనే తలుపులు మూసివేశారు. అయితే, అప్పటికే తేనెటీగలు భారీగా పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించడంతో, వీటి దాడిలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లతోపాటు మరో 20 మంది గాయపడ్డారు. తేనెటీగలు కుట్టడంతో క్షతగాత్రులు బాధతో విలవిల్లాడిపోతున్నారు. దీంతో అధికారులు స్థానికుల సహాయంతో వారిని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News