: వ్యక్తిగత సిబ్బందికి వీడ్కోలు పలికిన మన్మోహన్ సింగ్
ప్రధాని మన్మోహన్ సింగ్ ఇవాళ ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లోని తన కార్యాలయంలో వ్యక్తిగత సిబ్బందికి వీడ్కోలు తెలిపారు. 110 మంది వ్యక్తిగత సిబ్బందిని ప్రత్యక్షంగా కలుసుకుని వారు తనకు అందజేసిన సహాయ సహకారాలకు మన్మోహన్ ధన్యవాదాలు తెలిపారు. మన్మోహన్ సింగ్ కు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో మరో 400 మంది అనుబంధ సిబ్బంది తమ అభినందనలు తెలియజేశారు.