: హిందూపురంలో ఆగిన కౌంటింగ్
అనంతపురం జిల్లా హిందూపురంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల కౌంటింగ్ ప్రక్రియ ఆగిపోయింది. భోజన వసతి ఏర్పాటు చేయలేదనే కారణంతో కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపును ఆపేశారు. తమకు ఏ మాత్రం సదుపాయాలు కల్పించలేదని మండిపడుతున్నారు. అలాగే, నిజామాబాద్ జిల్లా వేల్పూరులో కూడా భోజనాలు పెట్టలేదనే ఆరోపణలతో కౌంటింగ్ ను సిబ్బంది నిలిపేశారు.