: దిగ్విజయ్ తాత టీవీ యాంకర్ ను పెళ్లాడతారా?
కాంగ్రెస్ సీనియర్ నేత, 67 ఏళ్ల దిగ్విజయ్ సింగ్.. లేటు వయసులో తన కూతురు వయసుకు సరిసమానమైన టీవీ యాంకర్ ను కచ్చితంగా పెళ్లాడతారా? ఇప్పుడు ఇది సందేహంగా మారింది. దిగ్విజయ్ సింగ్ భార్య కొంత కాలం క్రితం అనారోగ్యంతో కాలం చేశారు. దూరదర్శన్ టీవీలో యాంకర్ అయిన అమృతారాయ్ తో దిగ్విజయ్ కొంత కాలంగా రహస్య సంబంధం కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్న రొమాంటిక్ ఫొటోలు ఇంటర్నెట్ లో లీకయ్యాయి.
అమృతారాయ్ కంప్యూటర్ ను ఎవరో హ్యాక్ చేసి వాటిని కాస్తా నెట్ ప్రపంచంలో వదిలారు. గుట్టు కాస్తా బయటకు రావడంతో తాము వివాహం చేసుకోబోతున్నట్లు వారిద్దిరూ ప్రకటించారు. అమృతారాయ్ కి ఆమె భర్తతో విడాకులు మంజూరైన వెంటనే తాము పెళ్లి చేసుకోనున్నట్లు దిగ్విజయ్ తెలిపారు. ఇదే విషయమై ఆశీస్సులు కోరుతూ ఆయన శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతిని కలిసినట్లు సమాచారం. రెండో పెళ్లికి ఆశీస్సులు కోరగా స్వామి నిరాకరించినట్లు తెలిసింది. ప్రజా ప్రయోజనాలతో ముడిపడిన అంశాల్లోనే ఆశీర్వదిస్తానని తేల్చి చెప్పారు. మరి దిగ్విజయ్ స్వామి ఆశీస్సులు లేకపోయినా సరే అనుకుంటూ రెండోసారి పెళ్లి పీటలు ఎక్కుతారా? లేక అలానే సహజీవనం చేస్తారా? అన్నది చూడాలి.