: తిరుగుబాటు ఫలితం...తొమ్మిది రోజులుగా నీటి సరఫరా లేదు
ప్రభుత్వదళాలు, తిరుగుబాటు దళాల మధ్య పోరాటం మూడు మిలియన్ల మంది ప్రజలను తాగునీటికి కటకటలాడేలా చేసింది. గత కొంత కాలంగా సిరియాలోని అలెప్పో నగరానికి నీటిసరఫరాను తిరుగుబాటు దళాలు అడ్డుకున్నాయి. దీంతో గత తొమ్మిది రోజులుగా మూడు మిలియన్ల ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. 2011 నుంచి రావణకాష్టంలా రగులుతున్న అంతర్యుద్ధం కారణంగా సిరియాలో లక్ష మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.