: పోలైన వాటికంటే బ్యాలెట్ బాక్స్ లో ఎక్కువ ఓట్లు ఉన్నాయి
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా, మహబూబ్ నగర్ జిల్లాలో ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. పెబ్బేరు మండలం సూగూరులో ఓ బ్యాలెట్ బాక్సులో పోలైన ఓట్లకంటే 50 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో కౌంటింగ్ సిబ్బందితో పాటు, ఏజెంట్లు కూడా షాక్ అయ్యారు. జరిగిన ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.