: గుంటూరులో పోలైన ఓట్ల కంటే తగ్గిన బ్యాలెట్ పేపర్లు


ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. కాగా గుంటూరు జిల్లాలోని పలు చోట్ల ఎంపీటీసీ స్థానానికి పోలైన ఓట్ల కంటే బ్యాలెట్ పేపర్లు తగ్గడంతో కౌంటింగ్ నిలిచిపోయింది.

గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం ఎంపీటీసీ స్థానానికి పోలైన ఓట్ల కంటే బ్యాలెట్ పత్రాలు తగ్గాయి. మొత్తం ఐదు బ్యాలెట్ పేపర్లు తగ్గడంతో కౌంటింగ్ నిలిచిపోయింది. బాపట్ల 28వ పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్ల కన్నా మూడు బ్యాలెట్ పత్రాలు తగ్గడంతో కౌంటింగ్ నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News