: మున్సి‘పోల్స్’ ఫలితాలు మే 16కు తెర తీస్తున్నాయి: నరేంద్ర మోడీ


సీమాంధ్ర, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మే 16న ప్రకటించే ఫలితాలకు తెర తీస్తున్నాయని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అహ్మదాబాద్ లో తెలిపారు. "మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీకి సానుకూల ఫలితాలు అందించిన సీమాంధ్ర, తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాను" అని మోడీ ట్వీట్ చేశారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు రాష్ట్రాలు టీడీపీ-బీజేపీ కూటమికి ఘనవిజయాన్ని అందిస్తాయని ఆయన మరో ట్వీట్ లో వెల్లడించారు.

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ సీమాంధ్రలో మొత్తం 90 మున్సిపాలిటీలకు 65 మున్సిపాలిటీలను గెలుచుకుంది. తెలంగాణలో మొత్తం 53 మున్సిపాలిటీలకు కాంగ్రెస్ 20 మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా, బీజేపీ రెండు, టీడీపీ మూడు మున్సిపాలిటీల్లో విజయం సాధించింది.

  • Loading...

More Telugu News