: మన్మోహన్ వీడ్కోలు విందు
ప్రధాని మన్మోహన్ సింగ్ తన పదవీకాలం పూర్తి చేసుకుని పదవి నుంచి వైదొలగబోతున్నారు. ఈ నేపథ్యంలో తన కార్యాలయ సిబ్బందికి మన్మోహన్ సింగ్ ఈ రోజు మధ్యాహ్నం వీడ్కోలు విందు ఇవ్వబోతున్నారు. 16న ఫలితాలు వెలువడిన అనంతరం 17న ఆయన రాజీనామా చేయనున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే వస్తుందని స్పష్టం చేసిన నేపథ్యంలో మన్మోహన్ సింగ్ మరోసారి ప్రధాని అయ్యే అవకాశాలు తక్కువే. రాజీనామా చేసిన అనంతరం మోతీలాల్ నెహ్రూ రోడ్డులో కేటాయించిన మరో బంగళాకు ఆయన మారిపోతారు.