: బ్యాలెట్ బాక్స్ లో కరెన్సీ నోటు
సాధారణంగా బ్యాలెట్ బాక్స్ లో ఓటర్లు వేసిన బ్యాలెట్ పత్రాలే ఉంటాయి. కానీ, గుంటూరు జిల్లా కర్లపాలెం బ్యాలెట్ బాక్స్ లో కరెన్సీ నోటు దర్శనమిచ్చింది. ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు బ్యాలెట్ బాక్స్ ను తెరవగా అందులో 10 రూపాయల నోటు బయటపడింది. ఎవరైనా ఓటరు తమాషా కొద్దీ వేశాడో లేక పొరపాటుగా పడిపోయిందో అని అధికారులు అనుకున్నారు.