: రెండంతస్తుల రైలు ప్రారంభం
కాచిగూడ - గుంటూరు మధ్య రాష్ట్రంలోనే తొలిసారిగా రెండంతస్తుల (డబుల్ డెక్కర్) రైలు పట్టాలెక్కింది. ఈ రోజు ఉదయం 5.30 గంటలకు ఈ రైలును అధికారులు ప్రారంభించారు. సాధారణ రైళ్లకంటే భిన్నంగా ఉండడంతో ప్రయాణికులు ఎంతో ఆసక్తిని ప్రదర్శించారు. సుమారు 500 మంది ఈ రైలులో గుంటూరుకు వెళ్లారు. వీరిలో దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సాంబశివరావుతోపాటు పలువురు ఇతర అధికారులు కూడా ఉన్నారు.