: రంపచోడవరం, తిమ్మాపూర్, విజయవాడల్లో అభ్యర్థుల ఆందోళన
విజయవాడలోని సిద్దార్థ మహిళా కళాశాల, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ లోని నాగేశ్వరి కళాశాల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అభ్యర్థులను, ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు పంపేయడంతో... వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.