: అభిమానుల కేకలు ... ఈలలే నన్ను యంగ్ గా వుంచుతున్నాయి: నాగార్జున


తాను కనపడగానే అభిమానులు వేసే కేకలు .. అరుపులు ... ఈలలే తనకు ఇన్స్ పిరేషన్ అనీ, అందుకే తాను ఇంతటి గ్లామర్ గా, యంగ్ గా కనిపిస్తున్నానని అక్కినేని నాగార్జున చెప్పారు. ఈ రోజు జరిగిన 'గ్రీకువీరుడు' ఆడియో వేడుకలో అభిమానులను చూసి ఆయన రెట్టించిన ఉత్సాహంతో మాట్లాడారు.

తనకి తమన్, దేవిశ్రీ ప్రసాద్ వంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతో స్పూర్తి నిస్తున్నారనీ, వారు చేస్తున్న పాటలు విని ఉత్సాహంతో డ్యాన్సులు చేస్తున్నాననీ నాగ్ అన్నారు. "మీరెప్పుడు రిటైర్ అవుతారని ఈమధ్య ఎవరో నన్నడిగారు. నేను రిటైర్ అవ్వడమేమిటి? చైతన్య అవుతాడేమో ... అఖిల్ అవుతాడేమో ... నేను మాత్రం అవ్వను. బతికినంత కాలం కింగ్ లా నటిస్తూనే వుంటాను" అన్నారు నాగార్జున.      

  • Loading...

More Telugu News