: ప్రారంభమైన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బ్యాలెట్ విధానం కావడంతో ఫలితాల వెల్లడి ఆలస్యం కానుంది. దీంతో మధ్యాహ్నం 12 గంటల తరువాత ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లను లెక్కిస్తారు. అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ లను వేరు చేసి, 25 చొప్పున బండిళ్లుగా చేసి ఓట్లను లెక్కిస్తారు. రాత్రి 9 గంటల తరువాత పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.