: తిరుమలలో శ్రీలంక అధ్యక్షుడికి తమిళ సెగ


తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే నేడు దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఆయన ఈరోజు తిరుమలకు వస్తున్నారు. కుటుంబసభ్యులతో పాటు 60 మంది బృందంతో ప్రత్యేక విమానంలో ఆయన తిరుపతి చేరుకుంటారు.

ఇదిలావుంటే,
రాజపక్సే తిరుమల పర్యటనను వ్యతిరేకిస్తూ తమిళులు ఆందోళన చేబట్టారు. లక్షలాది మంది తమిళులను నిర్దాక్షిణ్యంగా హతమార్చిన రాజపక్సేను అడ్డుకుంటామని తిరుపతిలో తమిళ సంఘాలు గోడ పత్రికల ద్వారా హెచ్చరించాయి. దీంతో తిరుపతిలో పోలీసులు భారీ భ్రదతను చేపట్టారు.
  

  • Loading...

More Telugu News