: మచిలీపట్నంలో టీడీపీ... గుడివాడలో వైఎస్సార్సీపీ


కృష్ణాజిల్లా మచిలీపట్నం మున్పిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో కేవలం 9 కౌన్సిలర్లలకే పరిమితమైన టీడీపీ ఈ దఫా అత్యధిక మెజార్టీతో అధికారాన్ని చేజిక్కించుకుంది. మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 42 వార్డులుండగా, టీడీపీ 29 వార్డుల్లో విజయం సాధించింది. ఇక తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్సార్సీపీ 11 వార్డుల్లో గెలుపొందింది. కాంగ్రెస్ కేవలం ఒకే ఒక వార్డులో గెలిచింది. ఇదిలా ఉండగా 30వ వార్డు ఎన్నికల కౌంటింగ్ సందిగ్ధంలో పడింది. ఒక పోలింగ్ బూత్ లో వినియోగించిన ఈవీఎం బ్యాటరీ ఆన్ కాకపోవడంతో కౌంటింగ్ ను నిలిపివేశారు. 30వ వార్డులో మళ్లీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉందని తెలుస్తోంది.

గుడివాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. గత ఎన్నికల్లో టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే కొడాలి నాని, ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో ఆయన హవా కొనసాగింది. గుడివాడ మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులుండగా, టీడీపీ 15 వార్డుల్లో గెలుపొందగా, వైఎస్సార్సీపీ 21 స్థానాల్లో విజయం సాధించింది.

  • Loading...

More Telugu News