: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల తుది ఫలితాలు


తెలంగాణ, కోస్తాంధ్ర జిల్లాల్లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ కౌంటింగ్ పూర్తయింది. సీమాంధ్రలోని 92 మున్సిపల్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 65 స్థానాలను కైవసం చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 20, ఇతరులు 7 స్థానాల్లో విజయం సాధించారు.

తెలంగాణలో 53 మున్సిపల్ స్థానాలకు గానూ కాంగ్రెస్ 23, టీడీపీ-బీజేపీ కూటమి 11 స్థానాల్లో విజయం సాధించింది. టీఆర్ఎస్ 9 స్థానాలు, ఇతరులు 9, ఎంఐఎం ఒక్క స్థానంలో గెలిచింది.

  • Loading...

More Telugu News