: 'గ్రీకు వీరుడు' ఆడియో విడుదలైంది


టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా నటించిన 'గ్రీకు వీరుడు' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఆడియో సీడీలను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు విడుదల చేయగా, తొలి సీడీని వీవీ వినాయక్, బోయపాటి శ్రీను సంయుక్తంగా అందుకున్నారు. కామాక్షీ మూవీస్ పతాకంపై కె. దశరథ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ సంగీతం అందించాడు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగేశ్వరరావు, నాగ చైతన్య, అనుష్క, అమల, ఎస్పీ బాలు తదితరులు హాజరయ్యారు. ఈ సినిమాలో నాగ్ సరసన నయనతార, మీరా చోప్రా నాయికలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.  

  • Loading...

More Telugu News