: సాగర్ నీటి విడుదలకు సర్కారు నిర్ణయం
వేసవిలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని కృష్ణా, గుంటూరు జిల్లాలకు తాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి నుంచి ఈ నెల 9 వరకు నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తారు. మొత్తం 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.