: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ కార్యకర్తల సంబరాలు
సీమాంధ్ర ప్రాంతంలో 70 శాతానికి పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లోనూ ఇదే ఒరవడి కొనసాగుతుందని టీడీపీ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు.