: మున్సి‘పోల్స్’లో పొన్నం ప్రభాకర్ కు షాక్
కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పొన్నం ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలన్నింటితో పాటు కరీంనగర్ కార్పొరేషన్ ను కూడా టీఆర్ఎస్ గెలుచుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో పొన్నం పక్షపాత ధోరణితో వ్యవహరించడమే ఈ ఓటమికి కారణమని కాంగ్రెస్ శ్రేణులే అంటున్నాయి. మిగిలిన తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో నిలిచినా, కరీంనగర్ లో మాత్రం కాంగ్రెస్ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.