: తెలంగాణ, ఆంధ్రల్లో వారి ప్రభావం లేదు


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇవాళ వెలువడిన 145 మున్సిపాలిటీ ఎన్నికల్లో పెద్దగా ఫలితాలు రాకపోయినా వామపక్షాలు ఉనికిని మాత్రం చాటాయి. అయితే, ఒక్క మున్సిపాలిటీని కూడా వశం చేసుకోలేకపోయాయి. సీమాంధ్రలోని ఐదు జిల్లాల్లో వామపక్షాలు ఖాతాలు కూడా తెరవలేదు. మరో ఐదు చోట్ల ఒక్కొక్కస్థానం గెలుచుకున్నాయి. గుంటూరులో అత్యధికంగా 6, అనంతపురం జిల్లాలో 4 స్థానాలను వామపక్షాలు గెలుచుకోగలిగాయి.

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వామపక్షాలు తమ ఉనికిని చాటుకున్నాయి. అక్కడ వామపక్షాలకు 16 స్థానాలు దక్కాయి. నల్గొండలో 11 స్థానాలు దక్కాయి. కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఖాతా తెరవలేదు. నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో స్థానం దక్కించుకున్నాయి.

  • Loading...

More Telugu News