: తెలంగాణ 'హస్త'గతం
తెలంగాణ కాంగ్రెస్ హస్తగతమైంది. తెలంగాణలో జరిగిన నగరపంచాయతీ, పురపాలక, నగరపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 53 మున్సిపాలిటీలకు కాంగ్రెస్ పార్టీ 21 స్థానాల్లో 525 వార్డులను కైవసం చేసుకుని, విజయబావుటా ఎగురవేయగా, టీఆర్ఎస్ 313 వార్డులను గెలుచుకుని ఎనిమిది మున్సిపాలిటీలకు మాత్రమే పరిమితమైంది. టీడీపీ-బీజేపీ కూటమి 162 వార్డులను గెలుచుకుని 5 స్థానాల్లో విజయం సాధించగా, బీఎస్పీ 1 స్థానం నెగ్గి తెలంగాణలో పాగావేసింది. కాగా 18 స్థానాల్లో హంగ్ ఏర్పడింది.